కృష్ణా జిల్లాకు చెందిన రైతు గొప్ప మనసు చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని విద్యార్థుల హైస్కూల్ విద్య కష్టాలను తీర్చేందుకు అన్నే పద్మనాభరావు తన 2 కోట్ల రూపాయల విలువైన 50 సెంట్ల స్థలాన్ని ఉచితంగా దానం చేశారు. ఈ స్థలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ భవనం నిర్మించనున్నారు. ఈ పాఠశాల భవనానికి అన్నే పద్మనాభరావు తల్లిదండ్రులైన రామలింగయ్య, రాజ్యలక్ష్మి పేర్లను పెట్టాలని నిర్ణయించారు. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీకి అందజేశారు. విద్యాభివృద్ధి కోసం ఇంత విలువైన స్థలాన్ని దానంగా ఇవ్వడం చాలా ప్రశంసనీయమని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఆయన అన్నే పద్మనాభరావు సేవలను అభినందించారు. విద్యాభివృద్ధికి చేసిన ఈ గొప్ప సేవను ప్రశంసించారు. ఉప్పులూరు గ్రామంలోని విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం సుమారు నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి, అన్నే పద్మనాభరావు ముందుకు వచ్చారు.

విద్యార్థుల సౌకర్యార్థం యూపీ పాఠశాల అభివృద్ధికి పద్మనాభరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరైన పాఠశాల సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని, కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్నతనంలో పునాదిపాడు పాఠశాలలో చదువుకున్నానని, అప్పటినుంచి ఇప్పటివరకు తమ గ్రామంలో యూపీ పాఠశాలలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తాను గన్నవరంలో కాలేజీకి వెళ్లానని ఆయన చెప్పారు. తనకు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ఇతర గ్రామాలకు వెళ్లి విద్యను అభ్యసించానన్నారు. ఇప్పటికీ గ్రామంలో అనేకమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పద్మనాభరావు తెలిపారు.

గ్రామంలో ఎక్కువగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని.. వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ ఆలోచనకు తమ కుటుంబ సభ్యులంతా సహకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పద్మనాభరావు తెలిపారు. తాను భూమిని విరాళంగా ఇస్తున్నప్పుడు, అంత ఖరీదైన భూమిని దానం చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, తమ నిర్ణయం మారలేదని దాత తెలిపారు. విద్యాశాఖ, జిల్లా పరిషత్ అధికారులు త్వరితగతిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రూ.2 కోట్ల విలువైన భూమిని స్కూల్ కోసం దానం చేసిన పద్మనాభరావును అందరూ అభినందించారు. మొత్తం మీద పద్మనాభరావు తన సొంత ఊరి కోసం పెద్ద మనసుతో గొప్ప నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos