ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, పోలీసులే కారణమంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది.  విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ (51) టీవీకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం మయిలం గ్రామంలో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకు ఆయన వెళ్లారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక గదిలో ఉరి వేసుకుని కనిపించారు. ఆయన తల్లి మునియమ్మల్ గమనించి, చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు సెంజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహం వద్ద ఒక చేతిరాత లేఖను స్వాధీనం చేసుకున్నారు. "విజయ్ కరూర్‌కు వచ్చినప్పుడు పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. ఈ విషాదానికి సెంథిల్ బాలాజీనే కారణం. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని" ఆ లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమం కోసం కరూర్‌కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. అయ్యప్పన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియాంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా చుక్కిసలాట ఘటనకు సంబంధించి.. పార్టీ పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసు విచారణను రాష్ట్ర ఉన్నత పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. మొదట కరూర్ డీఎస్పీ సెల్వరాజ్ ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తును, మరింత లోతుగా విచారించేందుకు అదనపు ఎస్పీ ప్రేమానంద్‌కు అప్పగించారు. మానవ ప్రాణాలకు ప్రమాదం కలిగించడం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం వంటి ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్‌కుమార్‌లపై అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos