ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి దేశ రాజధానిలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలంతో ఈ కార్యక్రమం కొనసాగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 92 ఏళ్ల వయసున్న మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర ఆరంభమైంది. మిలిటరీ వాహనంపై నిగమ్ బోధ్ ఘాట్‌కు పార్థివదేహాన్ని అధికార, సైనిక లాంఛనాలతో తీసుకొచ్చారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనం నిల్చుని... పూలు చల్లుతూ కన్నీటి వీడ్కోలు పలికారు. నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, కొందరు మంత్రులు నివాళి అర్పించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి మనీష్ గోబిన్.. ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సహా పలువురు మంత్రులు, అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరైన వారిలో ఉన్నారు.

అదేవిధంగా ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. చివరిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధాతప్త హృదయంతో నివాళి అర్పించి  సెల్యూట్ చేశారు. ఆ సమయంలో అందరూ లేచి నిల్చుని మౌనం పాటించారు. ద్రౌపది ముర్ము నివాళి అర్పించిన అనంతరం దివంగత నేతకు సిక్కుల సంప్రదాయంలో అంత్యక్రియలను చేపట్టారు. ఆ సమయంలో సిక్ పెద్దలు సంప్రదాయబద్ధమైన కృపాణులను ధరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ప్రార్థనలు నిర్వహించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos