రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన  ‘ఆదిపురుష్’.చిత్రం విడుదల అయినప్పటి నుంచి ఏదో ఒక విమర్శ వస్తోంది. ఈ సినిమాలో  శ్రీరాముడిగా ప్ర‌భాస్‌, సీతాదేవిగా కృతిస‌న‌న్ న‌టించారు. ఈ సినిమా ఒకవైపు బాక్సాఫీసు వసూళ్లలో దూసుకొని పోతుండగా మరోవైపు నెగెటివ్ టాక్ లోనూ అలాగే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఆరడుగుల అజానుబాహుడుగా ప్ర‌భాస్ బాగానే ఉన్నప్ప‌టికీ చాలా చోట్ల త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ కార‌ణంగా ప్రభాస్‌ను చూడ‌లేక‌పోయామ‌ని చాలా మంది ఫీల్ అయ్యారు.

మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్వెల్ త‌ర్వాత ద‌శ‌ర‌థుడితో ప్ర‌భాస్ మాట్లాడే సంద‌ర్భంలో ఆయ‌న లుక్‌పై కామెంట్స్ చేస్తూ పిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇదిలావుండగా.. ఇప్పుడు ఈ సినిమా  డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా చేసిన వ్యాఖ్యల పైన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... హనుమంతుడు దేవుడు కాదని, ఆయనొక భక్తుడు అన్నారు.

ఆయన భక్తిలోని శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిగా చేశామన్నారు. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురి చేశాయి. అసలు నీవు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా ట్రోల్స్ పై శుక్లా మాట్లాడుతూ... ఆదిపురుష్ ను అణగదొక్కేందుకు రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు. మీరు ఈ సినిమాను చూస్తే ఎలాంటి ఫిర్యాదులు మీ నుండి రావని వ్యాఖ్యానించారు. హనుమంతుడు పాత్రపై మీకు స్పష్టత వస్తుందన్నారు. రాముడిలా తత్వవేత్త కాదని, కానీ హనుమంతుడు తెలివైనవాడు, బలవంతుడన్నారు. కానీ అతను మాట్లాడినప్పుడు, చిన్న పిల్లల వలె మాట్లాడుతాడన్నారు. విడుదల అయినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో నెగెటివ్ టాక్  వస్తోంది. ఇది ఆగేది ఎన్నడో చూడాలి.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos