తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. విమర్శకుల సమీక్షలు, ప్రేక్షకుల మౌత్ టాక్ వంటి అంశాలతో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్ళు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచాం. ఈ సినిమాతో ప్రభాస్ మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం దాదాపు రూ. 58.50 కోట్లు నెట్ వసూలు చేసినట్లు తెలిసింది.

అలాగే, మిగిలిన భాషలు, అన్ని ప్రాంతాలనూ కలిపి ఈ సినిమా మొత్తంగా మొదటి రోజు వందకోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది. ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు రూ.30 కోట్లు.. మిగతా భాషల్లో రూ.75 కోట్ల వరకూ ఆర్జించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

తెలుగు వెర్షన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కట్టారు. సినిమా తొలి రోజు వసూళ్లలో మెజారిటీ షేర్ ను తెలుగు ప్రేక్షకులే ఆర్జించి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా... సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా బాగాలేదన్నాడని హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేశారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై హిందూ సేన కోర్టుకెక్కింది. మతపెద్దలను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించేలా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాల సంగతి ఇలా ఉంటే... వసూళ్లలో మాత్రం ఆదిపురుష్ ... వేగంగా వెళుతోంది. ఈ వేగం... ఎన్నిరోజులు సాగుతుందో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos