ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న భారీ అంచనాలతో... ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పీపుల్ మీడియా సంస్థ ఏకంగా 180 కోట్లకు తెలుగు రైట్స్ తీసుకొని విడుదల చేయనున్నారు. భారీబడ్జెట్ పెట్టి తీసిన ఆదిపురుష్ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వస్తేనే వర్కవుట్ అవుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే మాగ్జిమం రికవరీ కావాలి.
రికవరీ అంటే ...సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చులకు మించి అన్నట్లు టిక్కెట్ రేట్లు ఉంటేనే సాధ్యం. తెలంగాణలో ఆ సమస్య లేదు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఆంధ్రాలో మాత్రం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండటం లేదు. గతంలో... రాధేశ్యామ్ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ... యూవీ క్రియేషన్స్ ప్రయత్నించటంతో .. పదిరోజుల పాటు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రీమియం టికెట్ పై 25 రూపాయలు అదనంగా ధర పెంచుకునేందుకు అనుమతులిచ్చింది.
ఇప్పుడు కూడా అదేవిధంగా ఆదిపురుష్ చిత్రం కోసం టికెట్ రేట్లు పెంచమని కోరేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తున్నట్లు సమాచారం. అయితే ఆదిపురుష్ కు టికెట్ రేట్లు కనుక పెంచితే మళ్లీ వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే మాత్రం కష్టం అంటున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. ఎందుకంటే పీపుల్స్ మీడియాకు రైట్స్ అమ్మేటప్పుడు ఏపీ ప్రభుత్వం ద్వారా టికెట్ రేట్లు పెంచే వెసులు బాటు కలిగించేలా మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ హైప్ వచ్చింది. ఇక ఇటీవల ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ... గ్రాండ్ గా సక్సెస్ అయింది.
సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి పలువురు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు. రణబీర్ కపూర్ 10 వేలమంది పేద పిల్లలకు ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపించనున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10 వేల మంది అనాథలకు, వృద్ధాశ్రమంలోని వారికి ఆదిపురుష్ సినిమా ఫ్రీగా చూపించనున్నారు. ప్రతి థియేటర్ లో ఆంజనేయస్వామి కోసం ఒక సీటు ఉంచుతామని చిత్రయూనిట్ పేర్కొంది. ప్రభాస్ అభిమానులతో పాటు దేశమంతటా ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రిలీజ్ వీకెండ్ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి నెలకొనాలంటే... సినిమాకు ఫస్ట్ డే ... ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పటికీ ... తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ బిజినెస్ జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇక ... ఈ సినిమా సక్సెస్ రేంజ్ ను ... ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos