రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్... రేపే అంటే జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్ర్మాండమైన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్​అలీ ఖాన్, సీతగా కృతి సనన్, హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీసింగ్ చేశారు. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీని ప్రకారం.. ఏపీ లోని థియేటర్లు ప్రస్తుతం సర్కారు నిర్దేశించిన ధరలపై రూ. 50 పెంచుకోవచ్చు. మూవీ రిలీజైన రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ ధర రూ. 50 పెంచుకోవచ్చు. అటు తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ... సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రోజుకు ఐదు షోలు మాత్రమే వేయనున్నారు. బెనిఫిట్ షోలపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, అనధికారికంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బెనిఫిట్ షోలు నిర్వహించనున్నారని సమాచారం.

అది ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారన్న సమాచారం మాత్రం లేదు. కాగా.. ప్రభాస్ యూఎస్ వెళ్లిపోయాడని... ఈ సినిమాను ఆయన అక్కడే చూస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటే, సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏంజరుగుతుందో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos