ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు పైకి గెలుపు పైన ధీమాగా ఉన్నా..లోలోపల మాత్రం డైలమాతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళి పైన పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నారు. నియోజకవర్గాల వారీగా నుంచి వచ్చిన నివేదికలతో పాటుగా సర్వే సంస్థల రిపోర్ట్స్ పైన కసరత్తు చేసారు. ఫలితంపైన జగన్,చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు. పార్టీ కేడర్ కు ఇద్దరు నేతలు ఫలితం పైన క్లారిటీ ఇస్తున్నారు.
మరోవైపు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానుందా... బీజేపీ హ్యాట్రిక్ ఆశలు నెరవేరాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమా... అంటే అవుననే సమాధానం వస్తోంది. జూన్ 4 అనంతరం చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో చార్ సౌ పార్ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల కదనరంగంలోకి దూకినా ఆ మేరకు సీట్లను సాధించలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ 250 సీట్లలోపే పరిమితం అయ్యేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ ఏపీ నుంచి కూటమికి 17 -20 ఎంపీ సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీట్ల సంఖ్య అటు, ఇటుగా వస్తే టీడీపీ సపోర్ట్ బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందని కమలనాథులు కూడా విశ్వాసంతో ఉన్నారు. అందుకే కేంద్రంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుందని జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి ప్రాధాన్యత కూడా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు మూడు సర్వే సంస్థలతో పాటుగా గతంలో కాంగ్రెస్ కోసం పని చేసిన మరో వ్యూహకర్త సంస్థ నుంచి సర్వే నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. అందులో ఏపీ ఫలితం పైన క్లారిటీ వచ్చింది. దీంతో..పార్టీ వర్గాలకు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీలో అభివృద్ధి జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుందని కూటమి నేతలు కూడా ఖుషీఖుషీగా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos