ప్రతి నెలా బ్యాంక్ సెలవులకు సంబంధించి ఆర్బీఐ జాబితా విడుదల చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంటుంది. స్థానిక పండగలు, జాతీయ సెలవులు వీటిని బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ జయంతితో పాటు వారాంతం నేపథ్యంలో వరుసగా 3 రోజులు బ్యాంకులకు హాలిడే ఉంది. ఏప్రిల్ 12 శనివారం .. రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఇది ప్రతీ నెలా వచ్చే సాధారణ సెలవు.ఏప్రిల్ 13 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది కూడా సాధారణ వారాంతపు సెలవు.ఏప్రిల్ 14 సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవు ఉంది.

ఇలా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి. మళ్లీ ఏప్రిల్ 18న గుడ్‌ఫ్రైడే సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా హాలిడే ఉంది. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి నేపథ్యంలోనూ చాలా ప్రాంతాల్లో సెలవు ఉంది. బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ సెలవుల సమయంలోనూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు నిరంతరాయంగా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. చాలావరకు ఏటీఎంలు కూడా పనిచేస్తూనే ఉంటాయి. అయితే, ఎక్కువ మంది విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో కొన్ని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగానే అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకోవడం మంచిది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos