తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కొత్తకొత్త వార్తలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు కొత్తగా ... అనూహ్యంగా సినీ నటుడు అల్లు అర్జున్ పేరు రాజకీయాల్లో వినిపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కథేంటో కాస్త చూద్దాం. బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని భట్టుగూడెంకు చెందినవారు. ఆయన ... సినీనటుడు అల్లు అర్జున్ కు కూతురునిచ్చిన మామ. వచ్చే ఎన్నికల్లో సాగర్ టికెట్ ఆశిస్తున్న కంచర్ల… స్థానికంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన వెయ్యిమందికి సరిపడా ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాలును అల్లుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభించే పనుల్లో ఉన్నారు. దీంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. ఇక వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ వస్తే… బీఆర్ఎస్ తరపున అల్లు అర్జున్ ప్రచారం కూడా చేస్తారని ఆయన అంటున్నారు. ఇటీవలే స్థానికంగా పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా సాగర్ నియోజకవర్గం... అల్లు అర్జున్ రాజకీయం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయాయి. కాగా... కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలంపాటు నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేశారు. ఇదిలాఉండగా... టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ... ఆ తరువాత కారెక్కారు. దీంతో 2018 ఎన్నికల్లో మంచిరెడ్డికే టికెట్ దక్కి... కంచర్ల చంద్రశేఖరరెడ్డికి రాకుండా పోయింది. ఆ తర్వాత కొంతకాలంగా సెలైంట్ గా ఉన్న ఆయన... తాజాగా మళ్లీ గేర్ మార్చి... ఈ సారి ఎన్నికల్లో నాగార్జునసాగర్ బరిలో ఉంటానని... నేను ఇక్కడ లోకల్ అని... టికెట్ వస్తుందని దీమాగా చెబుతున్నారు. ఇక ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ మరోసారి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి కూడా ఈసారి టికెట్ వదులుకునే పరిస్థితి లేదంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనమడు రంజిత్ యాదవ్ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా సాగర్ బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఒక్క టికెట్ కోసం ఇంతమంది నేతలు పోటీ పడుతుండటంతో… హైకమాండ్ ఏం చేయబోతుందనేది చూడాలి. మొత్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ నాగార్జున సాగర్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos