దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. విస్తృతంగా పెట్టుబడులు పెడుతుందన్న సంగతి తెలిసిందే. తన కార్యకలాపాల్ని వేగంగా విస్తరించుకుంటోంది. ఆయా రంగాలకు వ్యాపారాల్ని విస్తరిస్తోంది కూడా. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు, డేటా సెంటర్లు ఇలా బాగానే ఉన్నాయి. ఇప్పుడు దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పెద్ద మొత్తంలో డీల్స్ చేసుకోవడం విశేషం. తాజాగా.. మహారాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలన్నింటి విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు మించి ఉంటుందని తెలిపింది.

న్యూ ఎనర్జీ, రిటైల్, హాస్పిటాలిటీ, హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఈ అన్ని ఒప్పందాలతో రాష్ట్రంలో ఏకంగా 3 లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా వేసింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లలో ఒకరైన అనంత్ అంబానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు .. అనంత్ అంబానీకి కూడా కృతజ్ఞతలు చెప్పారు ఫడణవీస్.

ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే.. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఇప్పటివరకు ఏకంగా 50కిపైగా అవగాహనా ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఇందులో టాటా గ్రూప్, CEAT, ఎస్సార్ రెనివబుల్స్, భారత్ ఫోర్జ్, వెల్‌స్పన్ కార్పొరేషన్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఇందులో రూ. 30 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది. భారీగా డీల్స్ చేసుకున్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మాత్రం గురువారం సెషన్ లో రాణించలేదు. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడ్ అవగా.. రిలయన్స్ షేరు ఒక శాతానికిపైగా నష్టంతో చివరకు రూ. 1263.65 వద్ద సెషన్ ముగించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 17.11 లక్షల కోట్లుగా ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos