అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన పథకాన్ని అమలు చేస్తోంది. బలవంతపు బహిష్కరణలు, అరెస్టులు, కోర్టుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు లేకుండా.. ఎవరైతే స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధపడతారో, వారికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. 'ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత విమాన ప్రయాణంతో పాటు, చేతికి 2,600 డాలర్ల (సుమారు ₹2,15,000) నగదు బోనస్‌ను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఆఫర్ చేస్తోంది.

అక్రమ వలసదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా "CBP Home" అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ దేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారు ఈ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఒకసారి నిబద్ధతను తెలియజేసిన తర్వాత, ప్రయాణ ఏర్పాట్లతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. జనవరి 2025 నుండి ఇప్పటివరకు సుమారు 22 లక్షల మంది (2.2 మిలియన్లు) వలసదారులు ఈ పథకం ద్వారా తమ దేశాలకు సురక్షితంగా వెళ్ళిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. బలవంతంగా ఒక వ్యక్తిని అమెరికా నుండి బహిష్కరించడానికి (Deportation) ప్రభుత్వానికి సగటున 18,245 డాలర్లు ఖర్చవుతోంది. అదే ఈ 'స్వచ్ఛంద బహిష్కరణ' పథకం ద్వారా ప్రోత్సాహకంతో కలిపి కేవలం 5,100 డాలర్లకే ప్రక్రియ పూర్తవుతోంది. అంటే, ఒక్కో వలసదారునిపై ప్రభుత్వం దాదాపు 13,000 డాలర్లకు పైగా ఆదా చేస్తోంది. "అరెస్టులు, జైళ్లు వంటి భయం లేని వాతావరణంలో, సాధారణ ప్రయాణికుల్లా గౌరవప్రదంగా ఇంటికి వెళ్లేందుకు ఇది ఒక గొప్ప అవకాశం" అని DHS తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ (X) ద్వారా పేర్కొంది.

ఈ పథకానికి భారతీయ వలసదారులు కూడా అర్హులని అమెరికా స్పష్టం చేసింది. గత ఏడాది మే నెలలో కేవలం 1,000 డాలర్లతో ప్రారంభమైన ఈ ఎగ్జిట్ బోనస్, డిసెంబర్ నాటికి 3,000 డాలర్లకు పెరిగింది. అయితే, ప్రస్తుత 2026 జనవరి నాటికి ఈ మొత్తాన్ని 2,600 డాలర్లుగా ఖరారు చేశారు. పని, విద్య లేదా ఇతర వ్యక్తిగత పనులను పూర్తి చేసుకుని, పద్ధతి ప్రకారం తమ దేశాలకు తిరిగి వెళ్లాలనుకునే వారికి ఈ 'CBP హోమ్' యాప్ ఒక వారధిలా పనిచేస్తుందని అధికారులు వివరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే వలసదారుల నియంత్రణకు చేపట్టిన అత్యంత వేగవంతమైన, చౌకైన మార్గంగా 'ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్' నిలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos