తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనలో ఆసక్తి పరిణామం చోటుచేసుకోనుంది. 17న వేడుకలు జరగనుండగా... 16న రాత్రి అమిత్ షా నగరానికి రానున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో అమిత్ షా భేటీ కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మర్యాదపూర్వకంగానే సింధును అమిత్ షా కలవనున్నారని వెల్లడించాయి. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సింధును అమిత్ షా కోరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. క్రీడా రంగంలో పీవీ సింధుకు మంచి పాపులారిటీ ఉంది. దేశం తరపున వివిధ టోర్నీలలో ఎన్నో పతకాలు సాధించింది. తెలుగు రాష్ట్రంలో పీసీ సింధు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. తమ పార్టీ కోసం సింధు మద్దతు కోరే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే... సినీ, క్రీడారంగాలకు సంబంధించిన ప్రముఖులతో అగ్రనేతలు భేటీ అవుతున్నారు. గతంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విజయం సాధించినందుకు ఎన్టీఆర్‌ను ప్రశంసించడానికి అమిత్ షా కలిసినట్లు కాషాయ వర్గాలు బయటకు చెప్పినా... ఈ భేటీ వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో యంగ్ హీరో నితిన్‌, టీమిండియా ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో భేటీ అయ్యారు. ఇలా వరుసగా సెలబ్రెటీలతో భేటీ అవుతూ వస్తుండగా.. ఇప్పుడు పీవీ సింధుతో అమిత్ షా నేరుగా సమావేశం కానుండటం కీలకంగా మారింది.  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలావుండగా... అమిత్ షా గత ఏడాది సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం ద్వారా ... పార్టీకి రాజకీయంగా మైలేజి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా... అమిత్ షా 17న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైన క్రమంలో.. సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలు చేసే అవకాశముంది. దీంతో అమిత్ షా ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos