తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే విడతలో మొత్తం 119 స్థానాల్లో 115 స్థానాలకు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి... ఎన్నికల సమరశంఖం పూరించి సంచలనం సృష్టించారని అనుకుంటున్న క్రమంలో... ఇప్పుడు మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారనే సమాచారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఏడుగురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించిన విషయం, నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా హోల్డ్ లో పెట్టిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుని ... టిక్కెట్లు ఇవ్వలేకపోతున్న వారిలో ఇద్దరిని కొత్తగా మంత్రుల్ని చేయాలనే సంకల్పంతో ఉన్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు బుధవారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి స్వయంగా మీడియాకు ఈ విషయం చెప్పారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుండి .. పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈటల రాజేందర్ శాఖల్ని హరీష్ రావుకు కేటాయించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ  చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తప్పని పరిస్థితుల్లో టిక్కెట్లు నిరాకరించిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. తాండూరు నుంచి టిక్కెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డి కి, కామారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ కోసం త్యాగం చేసిన గంప గోవర్ధన్ కు మంత్రివర్గంలో అవకాశవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఒక్క పోస్టే ఖాళీగా ఉన్నందున... మంత్రి సబితా ఇంద్రారెడ్డితో  రాజీనామా చేయించాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరిలో ఉన్నందున... మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారం గురించి ప్రభుత్వం సమాచారం పంపింది. బుధవారం రాజ్ భవన్‌ లో ఇద్దరు మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారి పదవి కాలం చాలా స్వల్పమే. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేవరకు మాత్రమే పదవిలో ఉంటారు. నిజానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా ... వారు చేయగలిగిందేమీ ఉండదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరువాత మంత్రులుగా కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఏ నిర్ణయాలూ తీసుకోలేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. పేరుకు మాత్రమే మంత్రులుగా ఉంటారు. వారిద్దరూ పార్టీ మారకుండా కేసీఆర్... ఈ ప్లాన్ చేశారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి పదవుల్లో ఉన్నందున వారు ఇతర పార్టీల్లో చేరి పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోతే .. ఎమ్మెల్సీగానో అవకాశం ఇస్తానని కేసీఆర్ బుజ్జగించి ఉంటారని అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డి కీలక నేత. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే...  ఆయన సోదరుడు కొడంగల్ అభ్యర్థి కూడా వెళ్లిపోతారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుంది. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos