తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా-ఈ రేస్ కేసు వ్యవహారం అత్యంత సంచలనంగా మారింది . ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసులోకి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - ఈడీ ఎంట్రీ ఇచ్చింది. 

ఇందులో భాగంగా... ఈ వ్యవహారంలో కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు, ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశం వంటి తదితర వివరాలు ఇవ్వాలని కోరుతూ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు కూడా ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలు రావడంతో.. రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. ఈ సమయంలో ఏసీబీ నుంచి తీసుకున్న పత్రాల పరిశీలన అనంతరం వారి నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

మనీ బదిలీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఫార్ములా-ఈ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు ఫార్ములా-ఈ వ్యవహారంపై చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో  పట్టుబడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos