తెలంగాణ రాజకీయాలు రానురాను హాట్ హాట్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ లో వాడీవేడీ పెరిగింది. ఇప్పటికే మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతరావు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చి... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి ఒకరోజు కూడా గడవకముందే... మరో బీఆర్ఎస్ నాయకుడు ఆ పార్టీకి గట్టి షాక్ ఇవ్వబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు గత కొంతకాలంగా ఆ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని మోత్కుపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. బెంగుళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్‌లో మోత్కుపల్లి నర్సింహులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు తమ్ముడు లాంటి వారని చెప్పడంతోనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు మోత్కుపల్లి ఆ అనుమానాలు తీరుస్తూ ... కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు. మరోవైపు మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో డీకేను కలవడంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనమే అని తెలుస్తోంది. తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. రానున్న రోజుల్లో చేరికలు మరింత ఊపందుకుంటాయని చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos