కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులోని నిందితులకు వైసిపి నేతలతో సంబంధాలు ఉండటంతో ఈ విషయం చర్చకు దారి తీసింది. ఈ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అధికారపార్టీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ-2గా ఉన్న అరుణ్‌కుమార్ సీఎం జగన్, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఉంటూ వైఎస్సార్సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉండటం వల్లే వారితో ఫొటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ వద్ద ఓ వాహనంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉండటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసును పోలీసులు ఏ1గా చేర్చారు. ఏ2 అరుణ్‌కుమార్ కావడం ఆయనకు అధికారపార్టీతో లింకులు ఉండటం సంచలనమైంది. విజయవాడ వన్ టౌన్‌కు చెందిన డి. నాగబాబును ఏ-3గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ ముగ్గురిలో అరుణ్‌కుమార్‌కే వైఎస్సార్సీపీతో సంబంధాలు ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. రేవ్ పార్టీలో పలు మాదకద్రవ్యాలు వినియోగించారనేదానిపై విచారణ జరిపిన పోలీసులు ఆ పార్టీలో పలు ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వినియోగించినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. పలువురు టాలీవుడ్ యాక్టర్లు ఈ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారనే దానిపై సర్వత్రా సంచలనం రేపింది. కాగా డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ రావడం మరింత ఉత్కంఠ రేపింది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వ్యాపారం చేసే అరుణ్‌కుమార్‌ను వైఎస్సార్సీపీ నేతలు తరచూ కలుస్తుంటారు. ఇప్పటికే ఈ కేసులో లంకపల్లి వాసుతో పాటు అరుణ్‌కుమార్‌ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరిచి తర్వాత పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. మొత్తానికి బెంగళూరు పార్టీ రేవ్ పార్టీ నిందితులకు వైసిపి నేతలతో సంబంధాలు ఉండటంతో సంచలనం రేకెత్తుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos