భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి జరిగే ఎలాంటి ఉగ్రవాద దాడులనైనా యుద్ధంగానే పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి యుద్ధానికి తగిన విధంగా స్పందించాలని నిర్ణయించింది. భారత్, పాక్ మధ్య తాజా పరిస్థితుల గురించి.. ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో నిర్వహించిన హై లెవెల్ మీటింగ్‌లో ఈ విషయాలు వెల్లడించారు.

భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా.. అది నేరుగా భారత్‌పై చేసిన యుద్ధంగానే భావిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి వారికి తగిన స్థాయిలో సైనిక చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాలకు భారత్ బలమైన సంకేతం పంపినట్లు అయింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

భారతదేశంపై పాకిస్తాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం గేరు మార్చింది. ఇక నుంచి భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా.. దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధ చర్యలకు భారత త్రివిధ దళాలు దీటుగా ప్రతిస్పందిస్తాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక నుంచి భారత భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos