తెలంగాణలో ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం... టీఎస్‌పీఎస్‍సీ ని ప్రక్షాళన చేసిన ఈక్రమంలో బోర్డు సభ్యుల్లో ఏపీకి చెందిన వ్యక్తికి చోటు కల్పించింది. అయితే.. ఏపీకి చెందిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తోంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్‌పీఎస్‍సీ ఛైర్మన్ గా ... అనిత రాజేంద్ర ఐఏఎస్, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, యరబాడి రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఆంధ్రకు చెందిన యరబాడి రామ్మోహన్ రావు కి రేవంత్ సర్కార్ చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్ రావు.. ఏపీ లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. అయినా ఆయన ఏపీకి వెళ్లకుండా.. తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్నారు. కానీ, అప్పటి కేసీఆర్ సర్కార్.. ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. తెలంగాణలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా.. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయన ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సింది. ఈ తరుణంలో రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనను టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీకి బదులు తెలంగాణ వారిని సభ్యులుగా నియమిస్తే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన సర్వీస్ కమిషన్ నియామకల బోర్డుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.. దీంతో ఆ బోర్డును రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. కానీ బోర్డులోని సభ్యుల నియమకంపై విమర్శలు రావడం కొత్త ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి ఛైర్మన్ గా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos