రేపటి నుంచి అంటే 22 వ తేదీ వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ మూతపడబోతున్నాయి. బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం భారతీయ బ్యాంకర్ల అసోసియేషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకుల ఆసోసియేషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే రేపు నాలుగో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు.

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్న కారణంగా నగదు డిపాజిట్లు, చెక్కు క్లియరెన్స్‌లు, రుణ ఆమోదాలు, బ్రాంచ్ ల కార్యకలాపాలు వంటివి ప్రభావితం కానున్నాయి. చెక్కుల క్లియరింగ్, నగదు లావాదేవీలు, చెల్లింపులు, అడ్వాన్సులు కూడా నిలిచిపోనున్నాయి. బ్యాంకు సంఘాలు ఏడాదికి పైగా వారానికి ఐదు రోజుల పని దినం కోసం ఒత్తిడి చేస్తున్నాయి.  బ్యాంకులు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు చేసినా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో సమ్మె చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ప్రజలు తమకు ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని, ఏదైనా అసౌకర్యం కలిగితే సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos