భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ దేశాలలో సమున్నతంగా సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్న భారత్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  భారతదేశపు కీర్తి కిరీటంలో యునెస్కో నుంచి తాజాగా వచ్చిన ఒక గుర్తింపు కలికితురాయిగా నిలిచింది. భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గుర్తింపుగా, గౌరవ సూచకంగా భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమొరీ ది వరల్డ్ రిజిస్టర్ల స్థానం సంపాదించాయి. ఇది భారతీయులందరూ గర్వించదగిన శుభ విషయం.

శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, వేద వ్యాసుడు రచించిన భగవద్గీత తో పాటు, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో స్థానం దక్కడం ఒక అరుదైన గుర్తింపు. భగవద్గీత అనేది భారతీయ మతపరమైన ఆలోచన యొక్క గొప్ప సంశ్లేషణ, ధర్మం యొక్క వైదిక భావన. హిందువులు భగవద్గీతను అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారు. అటువంటి భగవద్గీతకు యునెస్కోలో చోటు దక్కటం భారతీయులంతా గర్వించదగిన విషయం. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వించదగిన క్షణమిది అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పోస్టులో వెల్లడించారు. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లలో చోటు దక్కించుకోవడమనేది.. విశ్వవ్యాప్తమైన గుర్తింపును మన సంస్కృతికి, భారతీయ జ్ఞానానికి అందించినట్టని ఆయన పేర్కొన్నారు. భగవద్గీత మరియు నాట్య శాస్త్రం శతాబ్దాలుగా మన నాగరికతను మరియు చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రెండు గ్రంథాలూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని తన ఎక్స్ ఖాతాలో మోదీ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos