ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శనివారం మిజోరాం కోసం మొట్టమొదటి బైరాబి-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించారు. ఈ రోజు మిజోరాంకు చారిత్రాత్మకమైన రోజు, ఎందుకంటే ఇది ఇప్పుడు భారతదేశ రైల్వే మ్యాప్‌లో భాగమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి మూడు రైళ్లను ప్రారంభించారు. బైరాబి-సైరాంగ్ కొత్త రైల్వే లైన్ ను 8,070 కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో నిర్మించారు. ఈ రైల్వే లైన్ ఒక సవాలుతో కూడుకున్న పర్వత ప్రాంతంలో నిర్మించారు. దీని కోసం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులలో 45 సొరంగాలు నిర్మించారు. ఇందులో 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మిజోరాం వెళ్లాల్సి ఉంది. అయితే.. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆయన ఐజ్వాల్‌కు చేరుకోలేకపోయారు. ఆ తర్వాత మిజోరాం విమానాశ్రయం నుంచే ఆయన వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మిజోరాం భారతదేశ అభివృద్ధి యాత్రలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, ఇది దేశానికి, ముఖ్యంగా మిజోరాం ప్రజలకు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఇప్పుడు ఐజ్వాల్ భారతదేశ రైల్వే మ్యాప్‌లో ఉంటుందని" అన్నారు. "కొన్ని సంవత్సరాల క్రితం, ఐజ్వాల్ రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఈ రోజు మేము దానిని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు గర్విస్తున్నాము. కొండ ప్రాంతంతో సహా అనేక సవాళ్లను అధిగమిస్తూ, బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ వాస్తవ రూపం దాల్చింది. మన ఇంజనీర్ల నైపుణ్యం, మన కార్యకర్తల ఉత్సాహం దీనిని సాధ్యం చేశాయని" ప్రధాని మోదీ అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos