మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టాక్ వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు పడటంతో ఓవర్సీస్ నుంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్‌లో భోళా గురించి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంతమంది సినిమా బాగుందని అంటుంటే.. మరికొంత మంది మాత్రం యావరేజ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ... రీమేక్ అసలు వర్కవుట్ అవలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా ... కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయని... ముఖ్యంగా మ్యాట్నీ నుంచి బుకింగ్స్ పెరిగాయని... ఫలితంగా కలెక్షన్లు మంచిగానే వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మిగిలిన ఏరియాలతో పోల్చు కుంటే మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే... ఓవర్సీస్‌లో ఈ మూవీ సందడి ముందుగానే ప్రారంభం కావడం... అక్కడ చాలా తక్కువ లొకేషన్లలోనే విడుదల అవడం వంటి కారణాల వల్ల... అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయని... కానీ ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదని తెలుస్తోంది. కాగా... అభిమానుల నుంచి, నెటిజన్స్ నుంచి కూడా ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్.. ఇంట్రో బాగుంది.. సాంగ్స్ యావరేజ్.. కొన్నిచోట్ల కామెడీ వర్కౌట్ అయింది.. అదే పాత కథ, రొటీన్ ప్లాట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా... సెకండ్ హాఫ్‌లో ఒరిజినల్ నుంచి మొత్తం ఎత్తేశాడని... ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బెటర్ అనిపిస్తుందని.. అలా చివరకు సినిమా పర్లేదు అనే మూడ్‌లో ఎండ్ అవుతుందని మరికొందరు ట్వీట్ చేశారు. చిరు కామెడీ టైమింగ్, కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్.. తమన్నా పర్ఫార్మెన్స్.. డ్యాన్స్.. సినిమాను చూసేలా చేస్తాయని.. మహతి పాటలు అద్భుతంగా ఉన్నాయని.. ఓవరాల్ డీసెంట్ హిట్.. బాస్ తన కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బెస్టేనని.. మెహర్ అద్భుతంగా తీశాడని.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని.. ఫైనల్లీ గుడ్ వాచ్ అంటూ ఇలా మెగా అభిమానులు ... సినిమా మీద పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారు. మొత్తానికి పలురకాల నెగెటివ్ కామెంట్లు కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. కానీ మెజార్టీ మాత్రం సినిమా ఒక్కసారి చూడొచ్చు అని సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే కచ్చితంగా భోళా ఎంటర్టైన్ చేస్తాడని అంటున్నారు. మొత్తానికి... భోళా రెండు తెలుగు రాష్ట్రాల్లో భలే దూసుకెళుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos