దేశప్రజలకు అలర్ట్.. రేపు అంటే జులై 9 బుధవారం నాడు భారత్ బంద్ . దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ.. దేశంలోని పదికిపైగా కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక భారత్ బంద్‌కు పిలుపునిస్తూ.. ప్రకటన చేసింది. రేపు తప్పకుండా బంద్ పాటించాలని కార్మిక సంఘాలు కోరాయి. అయితే రేపు భారత్ బంద్ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. బంద్ విజయవంతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక.. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం భారతదేశం అంతటా బంద్‌కు పిలుపునిచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా కార్మికులు బంద్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, వాటి అనుబంధ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొంటారని సమాచారం. అధికారిక, అనధికారిక రంగాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని ట్రేడ్ యూనియన్లు తెలిపాయి. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. సుమారు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారని భావిస్తున్నామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతులు, గ్రామీణ కార్మికులు కూడా నిరసనల్లో పాల్గొంటారని వెల్లడించారు.
బ్యాంకింగ్, బీమా, పోస్టల్, బొగ్గు గనులు, రహదారులు, నిర్మాణం వంటి పలు రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లోని కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. గత 10 సంవత్సరాలుగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కొత్త కార్మిక కోడ్‌ల ద్వారా కార్మిక సంఘాలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని, పని గంటలను పెంచడం, కార్మికుల హక్కులను తగ్గించడం, ప్రైవేటీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రోత్సహించడం. నియామకాలు, మెరుగైన వేతనాల డిమాండ్లను విస్మరించాలని కార్మిక యూనియన్ల నేతలు విమర్శించారు. ప్రభుత్వాలు యువత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులుగా.. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల కింద యజమానులకు ప్రయోజనాలను అందించడం చేస్తున్నాయని విమర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos