వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ... ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అంశం... ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా లేదు. క్షణక్షణానికి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటూ... ఈ వ్యవహారం మూడడుగులు ముందుకు ... ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారుతోంది. షర్మిల... తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసేందుకు అంగీకరించి... కాంగ్రెస్ షరతులకు ఆమోదం కూడా తెలిపారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాలన్నింటిపై ... ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించారు. ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. షర్మిలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వనుండటంపై కొందరు కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు.
షర్మిల కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతూ రాజకీయ పరంగా ఆయన దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్టీపీకి తెలంగాణలో ఆదరణ కరవవడంతో ... పార్టీని ఏంచేయాలో దిక్కుతోచని క్రమంలో... కాంగ్రెస్ లో విలీనం చేయని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ సహయం తీసుకుని చర్చలు జరిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు టిక్కెట్ ఇస్తే.. వైఎస్సార్టీపీని ... భేషరతుగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టారు. అయితే ... పాలేరు కాదు కానీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే సీన్ మారిపోయింది. ఈ ఎపిసోడ్ ముగింపునకు వచ్చిందనుకున్న దశలో ... ఇక ... రాహుల్ తో సమావేశం.. ఆ వెంటనే సోనియా సమక్షంలో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో షర్మిల సమావేశం కూడా అయ్యారు.
ఇదే సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం.. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి పనిచేయటం టీపీసీసీలోని ముఖ్య నేతలకు అస్సలు ఇష్టం లేదన్న చేదు నిజం బిగ్ టాపిక్ అయింది. కొందరు నేతలు మినహా.. మెజార్టీ నేతలు షర్మిల కాంగ్రెస్ లోకి రావటం..తెలంగాణలో పని చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా పలువురు బలహీన వర్గాలకు చెందిన నేతలు షర్మిల చేరికను పూర్తిగా వ్యతిరేకించారు. పార్టీని విలీనం చేశాక... తెలంగాణలో కాకుండా ఏపీలో పనిచేస్తే మాకు అభ్యంతరం లేదని ... అలాకాకుండా... షర్మిల తెలంగాణలో పనిచేస్తానంటే మాత్రం మేం ఒప్పుకోమని వారు భీష్మించుకుని కూర్చున్నారు.
దీంతో... పార్టీ విలీనం కోసం అన్నింటికి సిద్ధమై ఢిల్లీ వెళ్లిన షర్మిలకు పార్టీ అధినాయకత్వం నుంచి అదిన సమాచారం పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇక చేసేదేమీ లేక... తిరుగు టపాలో హైదరాబాద్ చేరుకున్న షర్మిల... నేను అన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమె రాజకీయంగా ఏం ప్రకటిస్తారనేది ఉత్కంఠగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos