బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత రాష్ట్రాన్ని వీడనున్నారు. వచ్చే వారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు శాసనమండలికి రాజీనామా చేసిన నితీష్ తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చిస్తున్నారు. నితీష్ కుమారుడు కి పదవి ఖాయమైంది. ఇక.. నితీశ్ కు కేంద్రంలో కీలక పదవి దక్కనుంది. బీహార్ కొత్త ముఖ్యమంత్రి గా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. అయితే.. ఇప్పటికే మోదీ- షా ద్వయం బీహార్ నూతన సీఎం ఎవరనేది ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

నితీష్ కుమార్ మార్చి 16వ తేదీన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా  నేడు శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. నితీష్ స్థానంలో బీజేపీ నేత బీహార్ సీఎంగా నియమితులయ్యే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో పదవసారి ప్రమాణ స్వీకారం చేయగా.. సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాగా.. బీజేపీ వ్యూహాత్మక రాజకీయంలో భాగంగా నితీష్ కు కేంద్రం లో కీలక పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కేంద్ర కేబినెట్ లో వ్యవసాయ శాఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత జాతీయ సమీకరణాల ఆధారంగా కీలక పదవి అప్పగించే అంశం పైన హామీ ఇచ్చారని చెబుతున్నారు.

ఇక, బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ముఖ్య నేతలు రేసులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీహార్ మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. సామ్రాట్ చౌదరి సీనియర్ బీజేపీ నాయకులలో ఒకరు. ఆయన బీహార్‌లో హోం శాఖ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేయడంతో పాటు రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నిత్యానంద్ రాయ్, ప్రస్తుతం కేంద్రంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతకుముందు బీహార్‌కు బీజేపీ అధ్యక్షుడిగా, హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. దిలీప్ కుమార్ జైస్వాల్ మూడుసార్లు శాసనమండలి సభ్యడుగా అనుభవం తో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కూడా పనిచేశారు. అయితే, సామాజిక సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న బీజేపీ నాయకత్వం నిత్యానంద రాయ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అనూహ్యంగా కొత్త వారికి అవకాశం ఇచ్చే నిర్ణయాలు ఈ మధ్య కాలంలో గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లో బీజేపీ తీసుకుంది. దీంతో, బీహార్ సీఎం విషయంలోనూ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos