తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను పెంచుకున్న బీజేపీ .ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సీటు నుంచి పోటీ పై కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ... తెలంగాణ లోని 17 స్థానాలకు గాను 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఆ పార్టీ అధిష్ఠానం లెక్కలు వేసుకుంటున్నది. యువతకు అవకాశం ఇస్తే.. పార్టీలోనూ జోష్ పెరుగుతుందని... మల్కాజ్‌గిరి నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి పార్టీ నాయకుడు రామ్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు  అభిషేక్ గౌడ్.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే... అభిషేక్ గౌడ్ చేసిన విజ్ఞప్తిపై లక్ష్మణ్ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. బహుశా సమయం వచ్చినప్పుడు అధిష్టానం ముందు ప్రస్తావించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఇది వరకే తాను మల్కాజ్‌గిరి టికెట్ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఈటల రాజేందర్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి అధిష్ఠానం ఈటల పేరును పరిశీలిలిస్తుందా లేక మరో ఆలోచన చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos