కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆదరణీయ సక్సెస్ చేకూరగా... అనూహ్యంగా బీజేపీ పరిస్థితి దిమ్మెతిరిగేలా దాపురించిన క్రమంలో... ఆ పార్టీ ప్రభ తగ్గుతూ వస్తోంది. విచిత్రంగా... కర్ణాటక ప్రభావం... తెలంగాణ పై కూడా పడిందా అన్న రీతిలో ఇక్కడ కూడా బీజేపీ కాంతులు రానురాను మసకబారిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ క్రమంలో ... లేని శక్తిని కూడదీసుకుని... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోగా చాపకింద నీరులా విస్తరించి ... అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.  జాతీయవాద అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని... జాతీయవాద అంశాలను ప్రజలకు ... మరీముఖ్యంగా యువతరానికి దగ్గరగా తీసుకెళ్లి... స్థానిక సమస్యలను కూడా లేవనెత్తాలని ఆ పార్టీ భావిస్తోంది. జాతీయవాద అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించి... యువత ఓట్లను కొల్లగొట్టాలని లక్ష్యంగా కృషి చేసేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఎన్నికల్లో ఓట్లు వేసేది ఎక్కువగా యువతేనని ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఓటర్లలో యువ ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.
తెలంగాణలో మొత్తం 3కోట్ల 03లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు ఎన్‌రోలింగ్‌ జాబితాలో దాదాపు 4లక్షల మంది 18-19 సంవత్సరాల వయసు ఉన్న కొత్త ఓటర్లు చేరుతున్నారని... మొత్తం ఓటర్లలో యువ ఓటర్ల సంఖ్య కోటికిపైనే ఉంటుందని , ప్రతీ ఎంపీ , అసెంబ్లీ సెగ్మెంట్‌లో వీరి ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది.
అందుకే యువత ఓట్లను పొందాలంటే జాతీయవాద అంశాలపై వరుస కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ అధిష్టానం రోడ్ మ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  ఇందులో భాగంగా... స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా జాతీయవాదాన్ని తట్టిలేపే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అమరవీరుల సంస్మరణార్థం దేశవ్యాప్తంగా మేరా మిట్టి – మేరాదేశ్‌ కార్యక్రమంతోపాటు ఆగస్టు 14న భారతదేశ విభజనను నిరసిస్తూ దేశ విభజన గాయాల సంస్మరణ దినాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. మేరామిట్టి- మేరా దేశ్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఆగస్టు 15 వరకు వరుస కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించనుంది. అధిష్టానం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి జిల్లాకు , ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇద్దరేసి కోఆర్డినేటర్లను నియమించింది.
ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర స్థాయిలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన వర్క్‌షాప్‌ కూడా జరిగింది. స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని ప్రజల్లోకి ముఖ్యంగా యూత్ లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామానికి వెళ్లి జాతీయ జెండాలను ఎగురవేయడం, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న మారణకాండపై ప్రచారం,  దేశ విభజన గాయాలకు చెందిన ఫోటోలు, ఫిల్మ్‌లను, నాటి వార్తాపత్రికల ప్రతులను ప్రదర్శనకు ఉంచనున్నారు. సార్వత్రిక ఎన్నికలనాటికి ప్రతి పల్లెలో జాతీయవాదాన్ని తట్టిలేపుతూ యువతను సంఘటితం చేసేలా బీజేపీ  ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇది వర్కవుట్ అయితే సైలెంట్ ఓట్ల సునామీ ఉంటుందని బీజేపీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ఓట్ల కోసం వీళ్లు రచించిన ప్రణాళిక ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో ... ఏమోననేది చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos