బీహార్ లో ఎన్డీఏ భారీ విజయం సాధించింది. అంచనాలకు మించి సీట్లు గెలుచుకుంది. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగనుంది. అయితే, ఈ సారి ముఖ్యమంత్రి ఎవరు.. నితీశ్ కొనసాగుతారా, లేక బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి వస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది. ఇదే సమయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. 2029 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు బీహార్ కొత్త ప్రభుత్వంలో బీజేపీ మార్క్ ఫార్ములా అమలు దిశగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి.

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... అత్యధికంగా 90 స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద రాజకీయ పక్షంగా బీజేపీ అవతరించింది. 85 సీట్లలో గెలుపుతో జేడీయూ రెండోస్థానంలో నిలిచింది. ఈ ఫలితాల ప్రాతిపదికన సీఎం పదవిని బీజేపీ ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న చర్చలు ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ ఇదే ప్రతిపాదనతో ముందుకు వస్తే నితీశ్ ఎలా స్పందిస్తారనే దాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ విపక్ష మహా కూటమిలో నితీశ్ (జేడీయూ) చేరినా 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం కష్టతరం అవుతుంది. జేడీయూ 85 సీట్లు, ఆర్‌జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాల 2 సీట్లను కలుపుకున్నా 117 సీట్లే అవుతాయి. దీంతో, బీజేపీ తమ పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.

అయితే, కేంద్రంలోనూ జేడీయూ ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ సమయంలో బీజేపీ నితీశ్ ను కాదనే సాహసం చేయదనే అభిప్రాయమూ బలంగా వినిపిస్తోంది. బీజేపీ (90) చేయాలనుకుంటే 19 సీట్లు సాధించిన ఎల్‌జేపీ, 5 సీట్లు గెల్చిన హెచ్ఏఎం, 4 సీట్లు పొందిన ఆర్ఎల్‌ఎంలతో పాటు మరిన్ని చిన్న పార్టీలనూ ఎన్‌డీఏ కూటమిలోకి చేర్చుకొని మేజిక్ ఫిగర్​ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుందా అనేదే స్పష్టత రావాల్సి ఉంది. నితీశ్ కు సీఎం పదవి ఇవ్వకుంటే తిరిగి ఆయన కాంగ్రెస్ కూటమి వైపు చూసే ఛాన్స్ ఉంది. ఆ కూటమి బలం పెంచే విధంగా బీజేపీ వ్యవహరించదని భావిస్తున్నారు. 2027లో జరిగే రాష్ట్రపతి ఎన్నికతో పాటుగా 2029 పార్లమెంట్ ఎన్నికలకు బీహార్ కీలకంగా మారనుంది. దీంతో.. నితీశ్ ను కాదని కొత్త సమస్యల కంటే.. నితీశ్ ను కొనసాగించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఒకవేళ బీజేపీ సీఎం సీటు ఆశిస్తే.. భవిష్యత్ లో ఉన్నత పదవి పైన హామీ ఇస్తూనే... నితీశ్ ను ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కీలక శాఖ అప్పగిస్తారనే ప్రచారమూ ఉంది. అటు ఎల్‌జేపీ అధినేత, కేంద్రమంత్రి అయిన చిరాగ్ పాశ్వాన్ సైతం తాజా ఎన్నికలతో బలమైన నేతగా ఎదిగారు. కొత్త ప్రభుత్వం లో చిరాగ్ ఎక్కువ మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ సీఎంలు (సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా) కూడా బీజేపీ నేతలే. రాబోయే ప్రభుత్వంలో కూడా నీతీశ్ సీఎం అయితే బీజేపీ నుంచి డిప్యూటీలు ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచినందున రాబోయే ప్రభుత్వంలో తమ పార్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి దక్కనుంది. ఎలాంటి ట్విస్టులు లేకపోతే.. వచ్చే వారం నితీశ్ మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos