బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని మరోమారు బెదిరింపులు రావటం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అనేకసార్లు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రాగా తాజాగా మరోమారు ఆయనకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కారును పేల్చేస్తామని, సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేస్తామని వర్లీ లోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పంపించారు దుండగులు. ఇక ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెసేజ్ ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి చేశారన్న దానిపైన దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఇప్పటికే అనేకమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చంపడానికి పెద్దఎత్తున ప్లాన్ చేసింది.

గత ఏడాది కూడా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్టు అందులో భాగంగానే ఆయనపై కుట్ర చేసినట్లు గుర్తించిన పోలీసులు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని చార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పుడు వేసిన చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ప్రకారం సల్మాన్ ఖాన్ ను చంపాలని ప్రయత్నం చేసిన ఆ ఐదుగురికి బిస్టోయ్ గ్యాంగ్ తో సంబంధాలున్నాయి. వీరు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు 25 లక్షల రూపాయల సుపారీకి ఒప్పుకున్నారని తేలింది. సల్మాన్ ఖాన్ కదలికలపైన ఫోకస్ పెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని, ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది.

సల్మాన్ ఖాన్ ను చంపటం కోసం ఉత్తర అమెరికా నుండి ఒక బాలుడిని తీసుకువచ్చినట్టు, అతను ప్లానింగ్ అంతా పూర్తి చేసినట్టు పోలీస్ అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిస్టోయ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు  పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా అరవై నుండి డెబ్బై మందిని రంగంలోకి దించారని పేర్కొన్నారు. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు తరచూ చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos