తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 15న బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  జరగనుంది. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజురుకానున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో.. స్పెషల్ సెషన్‌కు సంబంధించి పార్టీ అజెండాతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరిచాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూసీసీ, ఇండియా పేరును భారత్ గా మార్పు చేయాలన్న అంశాలతో పాటు పలు కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..  చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌పై చర్చ జరగాలని, అన్నిపార్టీలు మద్దతుగా నిలవాలని వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కాగా.. మణిపూర్ అంశం, ధరల పెరుగుదల తదితర అంశాలపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. మెజార్టీ విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్రంపై ఈ కూటమి నేతలు పలు అంశాలపై ప్రశ్నలు కురిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలావుండగా... దేశంలో... ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జమిలి ఎన్నికలకు కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు జరగకుంటే తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం మొదలు పెట్టాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కసరత్తులు చేస్తుండగా.. తాము అధికారం చేబడతామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos