ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0 ఇన్నింగ్స్‌కు సంబంధించిన మొత్తం బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, విద్య, వైద్యం, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లతో పాటు తయారీ రంగానికి కూడా అనేక పెద్ద ప్రకటనలు చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం ఎయిర్ బ్యాటరీల తయారీపై భారీ ఎత్తు తగ్గింపు ప్రకటించారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా లభిస్తాయని భావిస్తున్నారు.
బడ్జెట్ ప్రసంగంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యంగా కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, జింక్, సహా 12 ఇతర ముఖ్యమైన ఖనిజాల దిగుమతి సుంకంపై మినహాయింపు ప్రకటించారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అందించేందుకు లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి 35 అదనపు వస్తువులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు అందించారు.
ధరలు తగ్గేవి ఇవే..
------
క్యాన్సర్ మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
చేపల పేస్ట్
వెట్ బ్లూ లెదర్
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
LCD, LED టీవీలు
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
తోలు వస్తువులు
వైద్య పరికరాలు
ధరలు పెరిగేవి ఇవే..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos