తెలంగాణలో ఎలెక్షన్ షెడ్యూల్ విడుదల కన్నా సుమారు నెలరోజుల ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ... ఏకంగా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ఆట మొదలుపెట్టి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్... వరుసగా రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు తొలిదశ ప్రచారంలో 17 రోజుల్లో 41 సభల్లో పాల్గొనడం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వరుసగా రెండుసార్లు సిద్ధిపేట్ జిల్లా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి విజయఢంకా మోగించిన గులాబీ అధినేత.. ఈసారి కూడా అక్కడినుంచే శంఖారావం పూరించనున్నారు.
ఉద్యమాల పోరుగడ్డ హుస్నాబాద్ నియోజకర్గం. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ పాలనకు అంకురార్పణ కాబోతున్నదా.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. 2014లో జరిగిన తొలి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపిన హుస్నాబాద్ గడ్డ... 2018 ఎన్నికల్లోనూ తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపింది. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం కాబోతున్నదని బీఆర్‌ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నారు. 2014లో 63 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ - అప్పటి టీఆర్ఎస్ పార్టీ 2018లో మరో 25 స్థానాల్లో గెలుపొంది 88 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇప్పటికే నెలకొన్న రాజకీయ వాతావరణం, పలు జాతీయ సంస్థలు తేల్చిన సర్వేలతోపాటు, ప్రజల్లో బీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆదరణతో ఈసారి తప్పకుండా సెంచరీ కొడతామని బీఆర్‌ఎస్ నేతలు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హుస్నాబాద్‌లో ప్రా రంభిస్తుండటం తమ హ్యాట్రిక్ విజయానికి సంకేతమని బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. 2018లో సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దుచేసిన మరుసటిరోజే సెప్టెంబర్ 7న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక ఈసారి ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కేసీఆర్ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు అదే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos