రైళ్లు, బస్సులు ఇతర మోటారు వాహనాలు లేని కాలంలో ఎడ్లబండ్లపై రోజుల తరబడి ప్రయాణం చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చేది. ఆ తరువాత బస్సులు, రైళ్లు వచ్చాక ... విమానాలు కనుగొన్న తరువాత వేల కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాలైనా ... తక్కువ సమయంలోనే చేరుకోగలిగే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో... అంతకన్నా వేగంగా గమ్యస్థానాలను గంట వ్యవధిలోనే చేరుకోగలిగే హైపర్ సోనిక్ విమానాలు త్వరలో రాబోతున్నాయి.వాటి గురించి కాస్త తెలుసుకుందాం.
గంటకు 6000 కిలోమీటర్ల స్పీడ్ తో జర్నీ చేసే రోజులు కూడా ఫ్యూచర్ లో రానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం హైడ్రోజన్ ఇంధన శక్తితో నడిచే హైపర్ సోనిక్ విమానాలు రెడీ అవుతున్నాయి. ఇవి ఆకాశవీధిలో గంటకు 6,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలవు. 2035 నాటికి ఇలాంటి హైపర్ సోనిక్ విమానం అందుబాటులోకి రానుంది. కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి 3676 కిలోమీటర్ల దూరం ఉంది. విమానంలో వెళ్లేందుకు 4 గంటలకుపైనే టైం పడుతోంది.. హైపర్ సోనిక్ విమానం వస్తే అర గంటలోనే ఈ జర్నీ కంప్లీట్ అవుతుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ఏరో స్పేస్ కంపెనీ డెస్టినస్ ... హైపర్ సోనిక్ విమానాల తయారీ కి నడుం బిగించింది.
ఆ కంపెనీ డెవలప్ చేసిన నమూనా హైపర్ సోనిక్ విమానం జంగ్ ఫ్రా ను తొలిసారి 2021 నవంబర్ 19వ తేదీన జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో టెస్ట్ చేశారు. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన వివా టెక్నాలజీ ట్రేడ్ షోలో దీన్ని ప్రదర్శించారు. జంగ్ ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో ఒక మోడల్ ... కారు సైజులో.. మరో మోడల్ ... బస్సు సైజులో ఉంటాయి. ఈ విమానంలో ఒకే టైంలో 400 మంది జర్నీ చేయొచ్చు. దీని స్పీడ్ కెపాసిటీ మాక్ 5. అంటే కాంతి వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. గంటకు 6,000 కి.మీ. వేగంతో ఈ విమానం జర్నీ చేస్తుంది.జంగ్ ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో హైడ్రోజన్ ఆధారిత ఆఫ్టర్ బర్నర్ సిస్టమ్ ఉంటుంది.
ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విమానంతో గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళింది. ప్రస్తుతం మనం జర్నీ చేస్తున్న విమానాల స్పీడ్ గంటకు 900 కి.మీ కూడా ఇంతకంటే ఎక్కువే ఉంది. 2024కల్లా మాక్ 5 లెవల్ స్పీడ్ తో దీని ట్రయల్ పూర్తి చేయాలని డెస్టినస్ కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. 2035 కల్లా అన్ని లోపాలను అధిగమించి హైపర్ సోనిక్ విమానాన్ని తీసుకురావాలనే పట్టుదలతో డెస్టినస్ ఉంది. తొలుత కాశ్మీర్ టు కన్యాకుమారి రూట్ లో నడిపినా... ఆ తరువాత ఇలాంటి హైపర్ సోనిక్ విమానాలు దేశమంతా రయ్యురయ్యున ఎగురుతాయని ఆశించవచ్చు. అప్పుడు ఎక్కడికైనా అరగంటలో వెళ్లి... బిజినెస్ కార్యకలాపాలో... ఇతర ముఖ్యమైన పనులో ముగించుకుని మరో అరగంటలో తిరిగి స్వస్థలానికి వచ్చేయవచ్చు. ఇదేదో బాగుంది కదూ. మున్ముందు ఏంజరుగుతుందో చూద్దాం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos