తమిళ సినీ నటుడు, రాజకీయ నేత విజయ్ చుట్టూ కరూర్ తొక్కిసలాట కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల‌ 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయనకు సమన్లు జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు, సమయపాలన వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా జనం తరలిరావడం, జన నియంత్రణ ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తీవ్ర తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిష్పక్షపాత విచారణ కోసం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ, నవంబర్ 25న పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఇతర ముఖ్య నేతలను విచారించింది. డిసెంబర్ 4న కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేలంను కూడా రెండు గంటల పాటు ప్రశ్నించి, సభకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీసింది. ఇప్పుడు నేరుగా విజయ్‌ను విచారించడం ద్వారా సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కీలక సమాచారం రాబట్టి, బాధ్యులను గుర్తించాలని సీబీఐ భావిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos