భారత ప్రభుత్వం తదుపరి జనాభా లెక్కలు 2027లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇవాళ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జనాభా లెక్కల కోసం మార్చి 1, 2027 అర్ధరాత్రిని ఆధార తేదీగా పరిగణిస్తారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి చల్లని ప్రాంతాలలో, ఈ తేదీని అక్టోబర్ 1, 2026గా కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం శాఖ గెజిట్ లో పేర్కొంది.

రెండు విడతల్లో నిర్వహించనున్న ఈ జనగణన ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో 2026 అక్టోబర్ 1 నాటికి జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జనగణను పూర్తి చేయనుంది. మార్చి 2027 నాటికి మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది.

జనగణన నిర్వహణ కోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. అంతేకాదు.. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్ లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పించారు. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos