ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఏడాది సంభవించిన వరదలకు సంబంధించిన వరద సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకుగాను కేంద్రం ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయంపై నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయించింది. 

2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకుగానూ రూ.18,322.80 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా NDRF నుంచి 18 రాష్ట్రాలకు 4,808.30 కోట్లు కేంద్రం అందించింది. తాజాగా కేంద్రం అదనంగా కేటాయించిన మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్ కు రూ.608.08 కోట్లు, రూ. తెలంగాణకు రూ.231.75 కోట్ల విడుదలకు నిర్ణయం తీసుకుంది. మిగిలిన నిధులు ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన 5 రాష్ట్రాల ప్రజలకు సహాయం చేయడానికి హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ నిధులు కేటాయించింది. గత ఏడాది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు NDRF కింద ఉన్నత స్థాయి కమిటీ రూ.1554.99 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ వారికి శుభవార్త చెప్పింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos