ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో బీజేపీలో ఇటీవల మార్పు కనిపిస్తోంది. జాతీయస్థాయిలో అన్ని అంశాల్లో ఇప్పుడు  చంద్రబాబుకు ప్రాధాన్యమిస్తున్నారు కేంద్ర పెద్దలు. ఎన్డీఏ పరంగా కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు. మొన్న ఆమధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. కానీ సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణంతో చంద్రబాబు వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే ఈసారి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆహ్వానించింది. దీంతో బిజెపి తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

ఢిల్లీలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలలో ఫిబ్రవరి 1  చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే తెలుగు అసోసియేషన్ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో తెలుగు వారి ప్రభావం అధికమే. దాదాపు పది లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

ఢిల్లీ ఎన్నికల ఫలితాలను అనుసరించి దేశ రాజకీయాలు మారనున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరోవైపు ఆ పార్టీ పంజాబ్ కు కూడా విస్తరించింది. ఈ తరుణంలోనే ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దూకుడుగా వెళుతూ బీజేపీ తీరును ఎండ కడుతున్నారు. ఆ పార్టీకి కేజ్రీవాల్ కొరకరాని కొయ్యగా మారారు. అయితే మొన్నటి లోక్ సభ  ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో పొలిటికల్ మేనియా మారిపోయింది. అందుకే భారతీయ జనతా పార్టీ అక్కడ జాగ్రత్త పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos