సూపర్ విజనరీ ... అభివృద్ధికి మారుపేరు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఒక తరం ముందే ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని గొప్ప కీర్తి ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ... 2014లో కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తరువాత... విభజన గాయాలతో... తలకు మించిన రుణ భారంతో రాష్ట్రం విలవిల్లాడుతున్నా... ఏపీని నెమ్మదిగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు నడిపిస్తూ వచ్చారు.
ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకుని ... పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసి పలువురి ప్రశంసలు పొందారు. అలాంటి చంద్రబాబుపై... ఇప్పుడు తాజాగా .. అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంతో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని... హైదరాబాద్ కు, ఆంధ్ర ప్రదేశ్ కు పరిశ్రమలు తెచ్చేందుకు మమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్లారని ఆ సమయంలో చంద్రబాబు పనితీరు చూశానని, రోజుకు 14 గంటలపాటు చంద్రబాబు పనిచేసే వారని ప్రతాప్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు చేసిన కృషే కారణమని, హైటెక్ సిటీ చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ సందర్శించడానికి చంద్రబాబు కృషే కారణమని అన్నారు. ఆ సమయంలో అపోలో తరపున శాటిలైట్ టెలీ మెడిసిన్ స్టాల్ ను అక్కడ ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాన్ని క్లింటన్ ప్రశంసించారని, హైటెక్ మెడిసిన్ మారుమూల ప్రాంతాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. మా సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని... చంద్రబాబు ఒక పని చేశారంటే... అది కచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రగతిని నింపుతుందన్నారు. ప్రజాభిమానం చూరగొన్నందువల్లనే చంద్రబాబు... అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నేత అయ్యారని, నాయకుడిగా చంద్రబాబు ప్రస్థానం ఎవ్వరూ ఆపలేనిదని కీర్తించారు. చంద్రబాబు మున్ముందు ... ఇంకెన్నో ప్రగతికర పనులు చేసి ఈ రాష్ట్రానికి, దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకు గాను ఆయనకు భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని అపోలో ఛైర్మన్ డాక్టర్ ప్రతాపరెడ్డి అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos