ఏపీలో అక్రమంగా భారీఎత్తున విపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్న వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లో ఆయన దాదాపు గంటసేపు సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సాగుతున్న ఓట్ల తొలగింపు తంతును వివరిస్తూ... దీనిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయనకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని... ఓట్లు తొలగించడం, మరణించిన వారి ఓట్లు కొనసాగించడం.. దొంగ ఓట్లు నమోదు చేయడం వంటి అక్రమాలు చాలా ఉన్నాయని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య ఇప్పుడు వచ్చిందని ... విపక్షాల ఓట్లను భారీఎత్తున తొలగిస్తున్నారని ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై కోర్టులకు కూడా వెళ్లామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అసలు ఓట్లు తొలగించి, భారీగా నకిలీ ఓట్లు నమోదు చేశారని, గతంలో మా ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి చెత్త పనులు చేయలేదని.. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని అన్నారు.
దొంగఓట్ల వ్యవహారంపై విచారణకు ఈసీ... హైపవర్‌ కమిటీ వేయాలని చంద్రబాబు కోరారు. ఓట్ల అక్రమాలపై ఈసీకి వినతిపత్రం ఇచ్చిన బృందంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఓటర్ల జాబితాను సరిచేసిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశామని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా తాము ఢిల్లీకి వచ్చి ఈసీని కలిశానని ... ఈసీకి అన్ని ఆధారాలు సమర్పించామని... తాము ఇచ్చిన ఆధారాలు సరైనవా లేక వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులోని ఆధారాలు సరైనవా తేల్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల డేటాను వాలంటీర్లు తీసుకోవడంపైనా చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ఓట్ల అక్రమాలు పరిశీలించేందుకు ఈసీ అధికారులు రాష్ట్రంలో పర్యటించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నాలుగైదు ఉప ఎన్నికలు జరిగాయని, అందులో ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బోగస్‌ ఓటరు కార్డులను సైతం సృష్టించారని అన్నారు. నంబరు కూడా లేకుండా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి ఓట్లు వేశారని, తాము వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బహిర్గతం చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించినా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఇటీవల జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ఓట్లు నమోదు చేశారని, అయినా కూడా టీడీపీ విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. దేశవ్యాప్తంగా అనుసరిస్తున్నట్లుగా ఏపీలో కూడా టీచర్లు, అంగన్‌వాడీలకు మాత్రమే ఎన్నికల విధులను అప్పగించాలని... వాళ్లను ఎన్నికల విధులకు కేటాయించబోమని రాష్ట్రప్రభుత్వం చెప్పడం తప్పు అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి కమిషన్‌  వచ్చి అన్నిపక్షాలతో సమావేశం కావాలని కోరానని... మేమిచ్చిన డేటాను విశ్లేషించి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రతిపాదించానని.. ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులను పంపించడమే కాకుండా సాంకేతిక వ్యక్తిని అందులో నియమించాలని విజ్ఞప్తి చేశానని చంద్రబాబు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos