న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఏచూరికి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అందుకే ఆయన్ను కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ను దగ్గరి నుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సీతారాం అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. కమ్యూనిజం పట్ల ఆసక్తి పెంచుకుని, ఆ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని కొనియాడారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos