తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ... ఇప్పుడు... వామపక్షాల నేతలు... బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను బాగా వ్యతిరేకిస్తూ ఉంటాయి. ఇంతకాలం బాగా నమ్మించి... ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నట్టేట ముంచేశారని శాపనార్థాలు పెడుతూ ఉంటాయి. మొన్న మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులకు స్నేహహస్తం అందించిన బీఆర్‌ఎస్‌... ఇప్పుడు ఒక్కసారిగా దూరం పెట్టిందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికలకు కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో కామ్రేడ్లకు సీట్ల కేటాయింపు లేకపోవడంతో... వారు భగ్గుమంటున్నారు. మమ్మల్ని ఒక్క మాట కూడా సంప్రదించకుండా ... కేసీఆర్ ... మమ్మల్ని విసర్మించి ... బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై కామ్రెడ్లు ఫైర్ అవుతున్నారు. ఇదిలావుంటే... కమ్యూనిస్టులే ఇక్కడ తమతో పొత్తు పెట్టుకుని, జాతీయస్థాయిలో ‘ఇండియా’ కూటమిలోనూ చేరి ... వారే మిత్రద్రోహానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఈ రెండు పార్టీల రాజకీయం ఇలా నడుస్తుంటే... సందట్లో సడేమియా అన్నట్లు... కాంగ్రెస్ ఈ పరిణామాన్ని తనకు అనువుగా మలుచుకుంటోంది. కేసీఆర్ పక్కన పెట్టిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వల వేస్తోంది. ఈ క్రమంలో... తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఉభయ కమ్యూనిస్టు ముఖ్య నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే  ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసి ముందుకెళ్దామని కోరారు. ఇది ఒకరకంగా కమ్యూనిస్టులకు బంపరాఫర్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు.. మొన్న జరిగిన కమ్యూనిస్టుల సమావేశంలో ... కాంగ్రెస్‌తో పొత్తుపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం.. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించిన మాట వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ ఇచ్చేశారు.
కమ్యూనిస్టుల గౌరవానికి భంగం కలుగకుండా ఉంటే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని... కాంగ్రెస్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టామని... మా ప్రతిపాదనలకు కాంగ్రెస్ అంగీకరిస్తే పొత్తులకు సిద్ధపడతామని ఆయన వివరించారు. అయితే... పొత్తులపై మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్న సీపీఎంను సంప్రదించాకే తుది నిర్ణయం ప్రకటిస్తామని... కాంగ్రెస్‌తో కలిసినా, కలవకున్నా.. సీపీఎంతో కలిసే వెళ్తామన కూనంనేని క్లారిటీ ఇచ్చుకున్నారు. మరోవైపు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా స్పందించారు. పొత్తులపై తొందర పడాల్సిన అవసరం లేదని ... బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించలేదని... బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందని అన్నారు. కాంగ్రెస్ నుంచి నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తేనే చర్చలు చేస్తామని... పొత్తులపై ఏం చేయాలనే దానిపై సీపీఐతో కలిసే ఆలోచన చేస్తామని తమ్మినేని వివరించారు. సో.. అటు సీపీఐ, ఇటు సీపీఎం నేతలు ఇద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది.

ఇటు కాంగ్రెస్ కీలక నేతలు కూడా.. కామ్రేడ్లతో జతకడితే.. ఎక్కడెక్కడ మంచి ఫలితం ఉంటుంది.. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు.. ఏయే జిల్లాల నుంచి ఎన్ని ఇవ్వొచ్చు.. కమ్యూనిస్టుల బలమెంత.. అనే అంశాలపై ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు ... తెలంగాణ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు సహా పలు నియోజకవర్గాల్లో పట్టు ఉందని... అందువల్ల కమ్యూనిస్టులతో కలిసి అడుగేయడం మంచిదేనని.. ఇక ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరాఖరుకు కాంగ్రెస్ – కమ్యూనిస్టుల పొత్తులు ఎక్కడిదాకా వెళ్లి ఎక్కడ ఆగుతాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos