మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) - భారతీయ భారతీయ జనతా పార్టీ - ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీలు దశలవారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. తాజాగా మరో విడతలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 23 మందితో కూడిన లిస్ట్ ఇది. 23 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.

ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కాగా ... 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. మొత్తానికి ఈసారి ఎన్నికలు రెండు కూటముల మధ్య నువ్వానేనా అనే స్థాయిలో ఉత్కంఠ భరితంగా జరగనున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos