ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో ఇటీవల భారీగా డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. హోలీ సందర్భంగా ఆయన స్వగ్రామానికి వెళ్లగా ఢిల్లీలోని జస్టిస్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్ని మాపక సిబ్బంది.. గదిలో భారీగా నోట్ల కట్టల్ని గుర్తించారు . దీనిపై ఆ ఇంటి వాళ్లను అడగ్గా.. పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనపై ఆరా తీయగా .. జడ్జీ ఇంట్లో వాళ్ల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులు.. ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై దేశంలో దుమారం చెలరేగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వెంటనే న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ కు బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే తమ మీద భారీగా పనిభారం ఉందని.. తమకు ఇలాంటి మరకలు ఉన్న జడ్జీలు ఎందుకని.. సుప్రీంకోర్టుకు లేఖను రాశారు. ఈ క్రమంలో జడ్జీ ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై తాజాగా.. ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది . జస్టిస్ యశ్వంత్ వర్మను.. అన్నిరకాల న్యాయపరమైన విధుల నుంచి దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు... జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీంకోర్టులో నివేదిక, వీడియోలు కూడా సమర్పించారు . దీనిపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని విచారణకు నియమించారు. ఈ కమిటి విచారణ చేసిన తర్వాత తదుపరి నివేదిక ఆధారంగా న్యాయమూర్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అప్పుడు నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos