మహారాష్ట్ర గవర్నర్, NDA నామినీ అయిన సీపీ రాధాకృష్ణన్ దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. సీపీ రాధాకృష్ణన్ ... ఇండియా బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా, సుదర్శన్ రెడ్డి రెడ్డి 300 ఓట్లు సాధించారు. కాగా రాధాకృష్ణన్ కోయంబత్తూర్ స్థానం నుండి 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో ఆయన రెండుసార్లు గెలిచారు. 2019లో జరిగిన చివరి ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు.
తాజాగా ఆయన ఆర్థిక అఫిడవిట్ ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. భారీ స్థాయి ఆస్తులు ఉన్నప్పటికీ, ఆయనకు వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేనటువంటి విషయాన్ని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇది భారత రాజకీయాలలో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. రాధాకృష్ణన్ రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు సేవలు అందించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన రాజకీయ జీవితాన్ని నిబద్ధతతో నడిపిస్తూ, వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ రంగంలో వ్యాపార సంస్థల్లో వాటాలు కలిగి ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 7.31 కోట్లు. ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు, ఆభరణాలు ఉన్నాయి. భార్యతో కలిపి రూ. 18.15 లక్షల నగదు, రూ. 6.53 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 1.28 కోట్లు షేర్లు మరియు రూ. 1.36 కోట్లు బీమా పాలసీలు ఆయన ఖాతాల్లో ఉన్నాయి. ఆయనకు రూ. 2.36 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో భూములు, బంగారం, వజ్రాలు, షేర్లు ఉన్నా కూడా, ఆయనకి వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేవని అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇది భారత రాజకీయాల్లో చాలా అరుదైన విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos