రెండు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు ఎక్కడున్నా... వారందరూ బిగ్ బాస్ సీజన్ 7 ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ముగిసిన సండే ఎపిసోడ్ బాగా ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మేట్స్ తో గేమ్స్ మొదలు పెట్టారు. మొదటగా చిట్టీల గేమ్ ఆడారు. చిట్టీ తీసి అందులో ఉన్న ప్రశ్నని ఒక్కొక్క హౌస్ మేట్ ని అడిగారు. శోభాశెట్టిని పిలిచిన నాగ్ హౌస్ లో కన్నింగ్ ఎవరు అని అడిగాడు. దీనికి శోభా శెట్టి.. ప్రశాంత్ పేరు చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత తేనె పూసిన కత్తి ఎవరు అని అడగ్గా... సందీప్ మాస్టర్ అని రతిక తెలిపింది. కడుపు మొక్క తేజ అని శివాజీ అన్నారు. అనంతరం నామినేషన్స్ లో ఉన్నవారిని సేఫ్ చేసే ప్రక్రియ జరిగింది. అమర్ డీప్, ప్రియాంక, గౌతమ్, దామిని, శుభశ్రీ, రతిక నామినేషన్స్ లో ఉన్నారు. నాగార్జున ఎవరి ఫొటో ప్రేమ్ పగలగొడితే వాళ్ళు నాట్ సేఫ్. మిగిలిన వాళ్ళు సేఫ్. మొదటిరౌండ్ లో గౌతమ్, ప్రియాంక సేవ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ కొనసాగింది. హౌస్ లో కామన్ సెన్స్ లేనిది ప్రశాంత్ అని ప్రియాంక చెప్పింది. తర్వాత మరో రౌండ్ లో నామినేషన్స్ సేఫ్ ప్రక్రియ జరిగింది. ఇందులో నామినేషన్స్ లో మిగిలి ఉన్న వాళ్ళకి నాగార్జున కొన్ని పౌచ్ లు ఇచ్చారు. అందులో ఎవరికీ డైమండ్స్ ఉంటె వాళ్ళు సేఫ్.. రాళ్లు వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్. ఈ రౌండ్ లో రతిక సేఫ్ అయింది. ఇంతలో స్టార్ హీరో రామ్ పోతినేని వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ కి నాగార్జున డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలో రామ్ మార్కులు ఇవ్వడం విశేషం. కాసేపు రామ్ హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడి ... తరువాత హౌస్ ని వదిలి వెళ్లారు. ఇక నామినేషన్స్ లో అమర్, శుభశ్రీ, దామిని మిగిలారు. నాగార్జున ఒక మ్యాజిక్ డికాక్షన్ ని తీసుకుని అందులో మిల్క్ కలుపుతా అని చెప్పారు. అప్పుడు ఎవరి పేరు కనిపిస్తే వాళ్ళు సేఫ్. నాగ్ మిల్క్ పోయగానే అమర్ దీప్ పేరు కనిపించింది. దీనితో అమర్ దీప్ సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా నామినేషన్స్ లో మిగిలింది శుభశ్రీ, దామిని. ఇద్దరినీ నాగార్జున సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు. ఇద్దరి ఫొటోలు ఉన్న రెండు షిప్ బొమ్మలు ఉన్నాయి. ఎవరి షిప్ బొమ్మ పేలిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. నాగార్జున కౌంట్ డౌన్ ఫినిష్ చేయగానే దామిని షిప్ బొమ్మ పేలింది. దీనితో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. దామిని ఎలిమినేట్ కాగానే ప్రియాంక జైన్ కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. హౌస్ మేట్స్ ఎమోషనల్ గా ఆమెకి సెండాఫ్ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos