భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు, దాడుల విరామం తర్వాత జమ్మూ కాశ్మీర్, LOC సరిహద్దులోని  ప్రాంతాలలో ఆదివారం రాత్రి ప్రశాంతంగా గడిచింది. ఇంకా చెప్పాలంటే పహల్గాంలో ఉగ్రదాడి తరువాత తొలిసారి ఒకరోజు  పాక్ నంచి ఎలాంటి కాల్పులు, దాడులు లాంటివి జరగలేదు. మే 11న రాత్రి దాదాపు ప్రశాంతంగా గడిచిందని భారత బలగాలు చెబుతున్నాయి. పహల్గాం దాడి తరువాత సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు ప్రతిరోజూ కాల్పులు జరపడం లేక డ్రోన్ దాడులు లాంటి దుశ్చర్యలకు పాల్పడేవి. అయితే ఆదివారం సాయంత్రం డీజీఎంవోతో పాటు త్రివిధ దళాధిపతులు పాకిస్తాన్ కు ఇచ్చిన వార్నింగ్ కారణంగా నిన్న రాత్రి పాక్ నుంచి ఎలాంటి కాల్పులు, డ్రోన్ దాడులు లాంటి చర్యలు కనిపించలేదు. భారత సైన్యం ఈ విషయాన్ని తెలిపిందని వార్తలు వస్తున్నాయి. 

మే 10న భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ, దాడుల విరమణకు ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు విరమించాయి. అయినా ఆ రోజు రాత్రి పాకిస్తాన్ తన నీచ బుద్ధి చూపిస్తూ కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటల్లోనే జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా పలుచోట్ల కాల్పులకు తెగబడింది. దేశంలోని పలు నగరాల్లో డ్రోన్ల ద్వారా దాడులు చేసింది. భారత సేనలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. అటు నుంచి వచ్చిన డ్రోన్లను, మిస్సైల్స్ ను కొట్టిపారేసింది ఆర్మీ. 

పహల్గాం దాడి తరువాత, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై నిరంతరం కాల్పులు జరుపుతోంది పాక్. మన సైన్యం పాక్ వక్రబుద్ధిని తిప్పికొట్టింది. మే 7 నుండి 10 వరకు పాకిస్తాన్ భారతదేశంలోని పలు సైనిక స్థావరాలను నాశనం చేయడానికి పాక్ ప్రయత్నించగా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దీటుగా ఎదుర్కొని బుద్ధి చెప్పాయి. అదే సమయంలో పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసి తీవ్ర నష్టం కలిగించింది. 

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ నేపాలీ సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు పర్యాటకులు గాయపడ్డారు. మతం అడిగి మరీ, ముస్లిం కాదనుకుని నిర్ధారింంచుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఓ మహిళ తనను కూడా కాల్చేయాలని, భర్త లేని జీవితం వద్దని అన్నప్పుడు.. వెళ్లి మీ మోదీకి చెప్పుకో అంటూ పహల్గాం ఉగ్రవాదులు చెప్పిన విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుని ఆపరేషన్ సిందూర్ కు రూపకల్పన చేయడం... ఆ వెంటనే కార్యాచరణకు దిగడం తెలిసిందే.

Related Videos