తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటున్న క్రమంలో ... వారి వారి బలాబలాలు చూపించుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేయడం సహజమే. కానీ ఈ సారి మాత్రం... ఎదుటి పార్టీలతో కాకుండా ఒకేపార్టీలోని నేతల మధ్యనే హోరాహోరి పోరు నడుస్తోంది. ఈ పోరు ఏ ఒక్క పార్టీకే పరిమితం కాదు... అన్ని పార్టీల్లోనూ ఉంది.
నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న అంతర్గత యుద్ధం ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ తీవ్రమవుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించిన ఆ పార్టీ అధినేత అయిన సీఎం కేసీఆర్ ... తనకు తాను సెల్ఫ్ గోల్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను అడ్వాన్స్ గా ప్రకటించి పొరపాటు చేశారని వారు అంటున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఉదంతాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు. కేసీఆర్ ... ఈసారి స్టేషన్ ఘన్ పూర్ ప్రజెంట్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ నిరాకరించి... కడియం శ్రీహరి పేరు ప్రకటించడంతో... రాజయ్య... అధిష్టానం పై అలకబూనారు. పార్టీ మారాలని నిర్ణయించుకుని... కాంగ్రెస్ నేతలను కలిశారని కూడా ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అర్జంట్ గా ... అలర్ట్ అయింది.ఎమ్మెల్యే రాజయ్యతో చర్చలు జరిపి ... పలుహామీలు ఇవ్వడంతో ఆయన సంతృప్తి చెంది ... బీఆర్ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. రాష్ట్రంలో ఇదొక్కటే కాదు... ఇలాంటి స్టేషన్ ఘన్ పూర్ ఉదంతాలు ఇంకా చాలా ఉన్నాయని... అయితే అవన్నీ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని వారు అంటున్నారు. మల్కాజిగిరి ఇన్సిడెంట్ కూడా అలాంటిదే నని అంటున్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు కూడా ... బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన సంగతి తెలిసిందే. అధిష్టానం హనుమంతరావుకు మాత్రమే టికెట్ ప్రకటించి... ఆయన కోరినట్లు... కుమారుడు రోహిత్ కు నిరాకరించడంతో ఆయన అధిష్టానంపై అలిగి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వాస్తవంగా ... బీఆర్‌ఎస్‌లో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ... కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం ఏడాది ముందుగానే మొదలైంది. కానీ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తూ వారినే అభ్యర్థులుగా మరోసారి ఖరారు చేశారు.
కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక పెండింగ్‌లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని నర్సాపూర్, జనగామ స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గోషామహల్, నాంపల్లి విషయంలోనే ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని సమాచారం. అతి త్వరలోనే ఈ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో... కేసీఆర్... ముందుగా ప్రకటించిన అభ్యర్థులతోనే ఎన్నికలకు వెళతారా... లేక సమస్య తీవ్రమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల చేంజ్ వంటి కొత్త స్టెప్ తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos