హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గత ఏడాది సెప్టెంబర్‌17న తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా అదే ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్ర‌భుత్వ చీఫ్‌ విప్‌లు పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా ఈ బాధ్యతలను మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అప్పగించింది. సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సభ్యులు చురుకుగా పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దశాబ్ద కాలంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ ఉద్ఘాటించారు. అయితే రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసి తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. మతాన్ని విద్వేషాలు పెంచి సమాజానికి హాని చేసే విధ్వంసకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 1948 సెప్టెంబరు 17న తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని కేటీఆర్ వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos