దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్రమంలో.. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలనే ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ సోమవారం బిల్లు ప్రవేశ పెట్టకుండా ఉపసంహరణ దిశగా అడుగులు వేయడం వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 20వ తేదీతో ఈ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ లోగానే బిల్లును ప్రవేశ పెడతారని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో...  ఈ రోజు దీనికి సంబంధించిన రెండు బిల్లులను సభ ముందుకు తీసుకురావాల్సి ఉన్నా..లిస్టు నుంచి ఉపసంహరించుకోవడంపై పార్టీ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు. రేపు లేదా ఎల్లుండి బుధవారం బిల్లులు ప్రవేశపెట్టవచ్చని అంచనాలు వేసుకుంటున్నారు.

 కాగా జమిలి కోసం మొత్తం ఆరు బిల్లులను ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ, కేంద్రం ప్రస్తుతానికి రెండు బిల్లుల వరకే పరిమితం అయింది. బిల్లుల ఆమోదానికి ఉభయ సభల్లో బలం పైన బీజేపీ ఫోకస్ చేసింది. జమిలి బిల్లుపై వీలైనన్ని పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలతో అసలు జమిలి ఎన్నికలు జరుగుతాయా జరిగితే.. ఎప్పుడు అనేది ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రం ప్రతిపాదించి ఉప సంహరించుకున్న బిల్లులోని కీలక అంశాలను బట్టి చూస్తే...  జమిలి ఎన్నికలు 2034లోనే సాధ్యపడతాయనే అభిప్రాయం పలు రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతోంది. అయితే సాంకేతికంగా ప్రస్తావించిన అంశాలతో 2027లో.. లేదా కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారితే 2029 లో జరిగే జరుగుతాయని  మరో వాదన వినిపిస్తోంది.

అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన కసరత్తు చాలా ఉంటుందని, అందువల్ల సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తరువాతనే ఎన్నికల నిర్వహణ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos